Thursday, September 4, 2025

టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ రాజమహేంద్రవరం,సెప్టెంబర్ 4: స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ గొర్ల రమణయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనన్ గారి జీవిత విశేషాలు బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ, రాజకీయ జీవితం గురించి వివరించారు . విద్యార్థులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు ఇవ్వగా, అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు మాట్లాడుతూ, భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ముఖ్య అతిథి శ్రీ గొర్ల రమణయ్య గారికి చిరు సత్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన, రమణయ్య గారి బాల్యం, విద్యాభ్యాసం మరియు సామాజిక సేవల గురించి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి. అప్పారావు గారు మాట్లాడుతూ, సనాతన సంప్రదాయంలో గురువులను పూజించుకునే విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వి. సర్వేశ్వర రావు, ఎన్. త్రివేణి, టి. శ్యామల, టి.వి.వి. పద్మావతి, పి. రాంబాబు, ఎల్. మదన్ మోహన్, వి. లావణ్య, ఎం. పరిమళ, బి. సాయి లలిత, డి. రాఘవేంద్ర చందు తదితర అధ్యాపకులు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.


 

No comments:

Post a Comment