Saturday, August 23, 2025

📰 ప్రెస్ నోట్ ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు వి.భాస్కర్ రామ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోర్ల రమణయ్య గారు మాట్లాడుతూ ఆంధ్రకేసరి బాల్యం, విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి, రాజకీయ జీవితం గురించి విశదీకరించారు. కార్యక్రమంలో యువజన సమితి జనరల్ సెక్రటరీ సి.పి. రెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ బి.వి. అప్పారావు గారు పాల్గొన్నారు. అలాగే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


 

No comments:

Post a Comment