Wednesday, April 22, 2026

ది. 22.04.2026 వ తేదీన స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో Farewell day నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ కార్యదర్శి శ్రీ జమ్మి రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థులకు అలుమ్ని గ్రూప్ ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థి జి. ఆదిత్య ప్రెసిడెంట్ గా విద్యార్ధిని వై. ఇందు ను సెక్రటరీ గా నియమించడం జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ గొర్ల రమణయ్య గారు, ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. వి. అప్పారావు గారు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.రాజమహేంద్రి

Monday, March 16, 2026

ది. 16.03.2026 వ తేదీన స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని "వినియోగదారుల రక్షణ చట్టం" పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ప్రో|| గొర్ల రమణయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వినియోగదారుల రక్షణ చట్టం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ బి. వి. అప్పారావు గారు, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ది.10.03.2026 వ తేదీన స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో ఉన్నతి స్కిల్ డెవలప్మెంట్ వారిచే విద్యార్థులకు 30 రోజులు శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ప్రో|| గొర్ల రమణయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నతి అకాడమీ అధ్యాపకురాలు శ్రీమతి అకారకురం వినోలియా గారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి. అప్పారావు గారు, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని,విద్యార్థులు పాల్గొన్నారు.

our college photos