Wednesday, September 10, 2025

ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సాహిత్య వారసత్వాన్ని, రచనా వైశిష్ట్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి వి. నాగమణి గారు అధ్యక్షత వహించారు. ఆమె విశ్వనాథ గారి బాల్యం, రచనా ప్రస్థానం, కవితా శైలి మరియు తాత్విక దృక్పథం వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఈ వేడుకకు ఆంధ్ర కేసరి యువజన సమితి సభ్యులు శ్రీ మదిరాజు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, విశ్వనాథ గారి రచనల ప్రభావాన్ని, ముఖ్యంగా వేయిపడగలు మరియు రామాయణ కల్పవృక్షం వంటి మహత్తర గ్రంథాల ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ గొర్ల రమణయ్య గారు విశ్వనాథ గారి రచనలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆయన రచనలు కాలాతీతమైన మానవ విలువలను ప్రసారించాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయకిరణ్ గారు కవి సమ్రాట్ జీవన యాత్ర, ఆయన విద్యా నేపథ్యం, వృత్తి విశేషాలను విద్యార్థులకు పరిచయం చేశారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు గారు విశ్వనాథ గారి తెలుగు భాషాభివృద్ధిలో చేసిన కృషిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.



 

No comments:

Post a Comment